‘చంద్రముఖి 2(Chandramukhi 2)’ సినిమా టీమ్ జుబ్లీహీల్స్లో పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోమూవీ రిలీజ్‌కి ముందుగా టీమ్ అమ్మవారి దర్శనం చేసుకుని, ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. దర్శకుడు పి.వాసు .. హీరో లారెన్స్(Hero Lawrence) .. హీరోయిన్స్ కంగనా రనౌత్ – మహిమ నంబియార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ‘పెద్దమ్మ టెంపుల్(Peddamma Temple)’ ఒకటి. జూబిలీ హిల్స్ లోని ఈ ఆలయం ఎప్పుడు చూసినా భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అమ్మవారిని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. కొత్త సినిమాల పూజా కార్యక్రమాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక తమ సినిమా (Movie) విడుదలకి ముందు అమ్మవారిని దర్శించుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.ఆ సందర్భంగా అక్కడ అభిమానుల సందడి కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టు (Result)ను రాబడుతుందనేది చూడాలి.