Chandramukhi 2: నెల రోజుల్లోనే ఓటిటిలోకి ‘చంద్రముఖి2’!
చంద్రముఖి సినిమాలో జ్యోతికను చూసి ఎవరైనా భయపడాల్సిందే. ఇప్పటికీ కూడా ఈ సినిమా చూస్తే.. భయం భయంగానే ఉంటుంది. అందుకే ఇన్నేళ్లకు సీక్వెల్ తెరకెక్కించారు. కాకపోతే ఈసారి చంద్రముఖి2 పెద్దగా భయపెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తోంది.
2005లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’.. అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి-2 తెరకెక్కించా దర్శకుడు పి.వాసు. ఈ హిట్ సీక్వెల్లో రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు. కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించింది. వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక శరత్‌కుమార్, మహిమా నంబియార్, సృష్టి డాంగే, రావు రమేష్, సుభిక్షా కృష్ణన్లతో వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలె సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ అయింది.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవడంతో.. చంద్రముఖి2ని తమిళ, హిందీ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రామ్, బోయపాటి ‘స్కంద’ సినిమాకు పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది చంద్రముఖి2. స్కంద మేనియాలో తెలుగులో ఎక్కడా కనిపించకుండా పోయింది. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు కాబట్టి చంద్రముఖికి పెద్దగా బజ్ రాలేదు. అందుకే.. నెల రోజుల లోపే డిజిటల్ బాట పట్టేసింది చంద్రముఖి2.
ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా అక్టోబర్ 26న అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. ఈ లెక్కన నెల రోజుల్లోనే చంద్రముఖి ఇంట్లోకి వచ్చేస్తోంది అన్నమాట. మరి థియేటర్లో మెప్పించలేక, భయపెట్టలేకపోయని చంద్రముఖి.. ఓటిటిలో ఎలా అలరిస్తుందో చూడాలి.