Sai Pallavi: బాబోయ్.. సాయి పల్లవి వల్లే ఆ సినిమాలు ఫ్లాప్!
తెలుగులో లేడీ పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తోంది. అయితే.. సాయి పల్లవి ఏ సినిమా చేసిన హిట్ అవుతుంది.. కానీ ఆమె వల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని కొందరు అంటున్నారు.
Sai Pallavi: చివరగా తెలుగులో ‘గార్గి’ అనే డబ్బింగ్ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరిచిన సాయి పల్లవి.. ‘విరాట పర్వం’ తర్వాత మరో తెలుగు స్ట్రెయిట్ ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. దీంతో అమ్మడు ఇక సినిమాలు మానెస్తుంది.. వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని.. ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణ పనులతో బిజీగా ఉందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత తమిళ్లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది. కానీ తెలుగులో సరైన స్క్రిప్ట్ కుదరక పోవడం వల కాస్త గ్యాప్ ఇచ్చింది. ఫైనల్‌గా నాగ చైతన్యతో కలిసి మరోసారి రొమాన్స్ చేస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే.. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది సాయి పల్లవి. తనకు కథ నచ్చితేనే సైన్ చేస్తుంది. లేదంటే నిర్మోహమాటంగా నో చెప్పేస్తుంది.
అందుకే.. ఆమె ఓకె చేసిన సినిమాలు హిట్ అవుతాయనే టాక్ ఉంది. లేదంటే ఫ్లాప్ అవుతాయని ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్‌గా మారిపోయింది. అందుకు ఎగ్జాంపుల్ ఈ ఫ్లాప్ సినిమాలేనని అంటున్నారు. డియర్ కామ్రేడ్, చంద్రముఖి2, వలిమైతో పాటు మెగాస్టార్ భోళా శంకర్‌లో కూడా సాయి పల్లవికి ఆఫర్స్ ఇచ్చారు. కానీ ఇందులో ఒక్క సినిమాకు కూడా సాయి పల్లవి ఒప్పుకోలేదు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే చాలు.. ఆ సినిమా ఫ్లాప్ అయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. అయితే.. సాయి పల్లవి రిజెక్ట్ చేయడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతాయా? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. కానీ కంటెంట్ లేకపోవడం వల్లే సాయి పల్లవి ఆ సినిమాలను రిజెక్ట్ చేసింది. అందుకే.. ఆ సినిమాలు పోయాయి. కానీ సాయి పల్లవి కథల ఎంపిక మాత్ర సూపర్ అనే చెప్పాలి.