OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..!
ప్రతివారం థియేటర్స్‌లో సందడి చేయడానికి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని హిట్ అయితే, కొన్ని ఫట్ మంటాయి. అవి హిట్ అయినా, అవ్వకున్నా కొద్ది రోజులకు ఓటీటీలో అడుగుపెట్టడం చాలా కామన్.
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచమే నడుస్తోంది. అందుకే చాలా మంది థియేటర్ లో చూడని ప్లాప్ మూవీలను సైతం ఓటీటీలో చూస్తూ ఉంటారు. అందుకే, ఏ వారం ఏ మూవీ ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి, ఈ వారం ఏయే సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయో ఓసారి చూద్దాం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం ప్రీమియర్ అవుతున్న టైటిల్‌ల జాబితా ఇక్కడ ఉంది.
స్కంద.. ది మాస్ యాక్షన్ రామ్ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఇది ఈ నెల 27 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుంది.
చంద్రముఖి 2.. బ్లాక్ బస్టర్ చంద్రముఖికి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద వాష్ అవుట్ అయింది. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హారర్ థ్రిల్లర్ అక్టోబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
కాఫీ విత్ కరణ్: 8 కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ వివాదాస్పద టాక్ షో ఎనిమిదవ సీజన్ ఈ నెల 26వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్: ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంట్ సిరీస్ గ్రహం మీద ఉన్న 99% జాతులను తుడిచిపెట్టడానికి, గొప్ప విధ్వంసానికి దారితీసిన సంఘటనలను చాటిచెబుతుంది. ఇది అక్టోబర్ 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది.