సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో కమల్‌హాసన్ ఉదయనిధి స్టాలిన్‌కు అండగా నిలిచారు.
విక్రమ్ ల్యాండ్, ప్రజ్ఞాన్ రోవర్‌లను రేపు యాక్టివేట్ చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రునిపై మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఇవి పనిచేస్తే ఇస్రో మరో చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎఫ్‌వో అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో గంటన్నర శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రతి నెలా కొన్ని రూల్స్ మారుతుంటాయి. కొత్త రూల్స్ అమలోకి వస్తుండటం అందరికీ తెలిసిందే. తాజాగా అక్టోబర్ నెలలో కూడా ఆర్థిక రంగంతో పాటుగా మరికొన్ని రంగాల్లో కీలక మార్పులు జరిగాయి. వాటి ఆధారంగా కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం.
Supreme Court: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన్ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తమిళనాడు ప్రభుత్వంతో పాటు మంత్రులు ఉదయనిధి, ఎ. రాజాకు నోటీసులు జారీ చేశారు. ఉదయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనే డిమాండ్‌తో కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయాలు, నిబంధనల వల్ల ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ధర్నాకు దిగారు. దీంతో ఉల్లి విక్రయాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీనివల్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రభుత్వం తరుపున విధులు నిర్వర్తించాల్సిన పోలీసు అధికారి ఉగ్రవాదుల చేతిలో కీలు బొమ్మ అయ్యాడు. డబ్బుకు కక్కుర్తి పడి టెర్రరిస్ట్‌లకు సలహాలు ఇస్తూ ఊడిగం చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ మరో బ్రాండుకు లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నేడు భారత స్టోర్లకు వచ్చిన ఐఫోన్లు కొనేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున స్టోర్ల వద్దకు చేరుకున్నారు. కొంత మంది అయితే అర్ధరాత్రి నుంచే లైన్లలో వేచి ఉండి మరి ఫోన్లను తీసుకుని మురిసిపోతున్నారు.
ఉగ్రవాదులు, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయొద్దని టీవీ ఛానెల్స్ నిర్వాహకులకు కేంద్రం స్పష్టంచేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం ఆమోదం పొందింది. లోక్‌సభలో ఈ బిల్లును ఆమోదించిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.
చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఈరోజు అత్యవసర హెచ్చరిక (emergency alert) పేరుతో ఓ మేసెజ్ వచ్చింది. అయితే ఇది చూసిన అనేక మంది యూజర్లు ఏదైనా హ్యాకింగా లేదా మేసెజ్ ఎందుకు వచ్చిందని ఆందోళన చెందారు. అయితే ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపబడిన టెస్ట్ సందేశమని భయాపడాల్సిన పనిలేదని అధికారులు పేర్కొన్నారు.
NEET PG 2023 కట్-ఆఫ్ పర్సంటైల్‌ను తగ్గించాలనే వైద్యుల సంఘాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, మిగిలిన రౌండ్‌ల కౌన్సెలింగ్‌కు ప్రతి ఒక్కరినీ అర్హులుగా చేసింది. ఈ క్రమంలో కట్-ఆఫ్ పర్సంటైల్ ని అన్ని వర్గాలకు సున్నాకి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
లోక్‌సభలో నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు(women's reservation bill) వ్యతిరేకంగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Owaisi), ఆయన పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఇద్దరు కూడా వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగతా అన్ని పార్టీల ఎంపీలు మద్దతిచ్చిన బిల్లుకు వీరు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేశారో కూడా స్పష్టం చేశారు. అయితే ఆ విషయమెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేవలం 8.30 గంటల్లోనే మీరు కోరుకున్న నగరానికి చేరుకోవచ్చు. అదికూడా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్లవచ్చు. అవును ఈ రూట్లో సెప్టెంబర్ 24న వందే భారత్ ట్రైన్(vande bharat express) ప్రారంభం కాబోతుంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది. దీంతో మహిళలకు అసెంబ్లీ, పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే 2029 ఎన్నికల్లో ఈ బిల్లు అమలు కానుంది.