»Kacheguda Yeshwantpur Vande Bharat Express Started On September 24th 2023
Kacheguda-Yesvantpur: వందేభారత్ ప్రారంభ తేదీ ఖరారు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేవలం 8.30 గంటల్లోనే మీరు కోరుకున్న నగరానికి చేరుకోవచ్చు. అదికూడా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్లవచ్చు. అవును ఈ రూట్లో సెప్టెంబర్ 24న వందే భారత్ ట్రైన్(vande bharat express) ప్రారంభం కాబోతుంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Kacheguda Yeshwantpur Vande Bharat express started on september 24th 2023
బెంగళూరు(bengaluru), హైదరాబాద్(hyderabad) రెండు టెకీ నగరాలను కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్(vande bharat express) మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. అయితే దీనిని సెప్టెంబర్ 24న ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే (SCR)చే నిర్వహించబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్. దాని ప్రాథమిక నిర్వహణ కాచిగూడలో ఉంటుంది. ఇది సెప్టెంబర్ 24న కాచిగూడలో ఫ్లాగ్ ఆఫ్ చేయబడుతుంది. ఆ రోజు దాదాపు అన్ని ప్రధాన స్టాప్‌లలో ఆగుతుంది. వాణిజ్య కార్యకలాపాలు మరుసటి రోజు ప్రారంభమవుతాయని SCRలోని ఒక అధికారి తెలిపారు. ఇది వారంలో 6 రోజులు అందుబాటులో ఉంటుంది. కానీ బుధవారం ఈ ట్రైన్ సేవలు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సెమీ-హై-స్పీడ్ రైలు యశ్వంత్‌పూర్(Yesvantpur), కాచిగూడ(Kacheguda) మధ్య 609.81 కి.మీలను కవర్ చేయడానికి సగటున 71.74 కి.మీ వేగంతో 8.30 గంటలు ప్రయాణం చేయనుంది. ఇది ప్రస్తుత వేగవంతమైన రైలు (దురంతో ఎక్స్‌ప్రెస్) కంటే గంట వేగంగా ఉంటుంది. అయితే ఇది కర్ణాటకలోని మరే స్టేషన్లోనూ ఆగదు. అయితే రైల్వే బోర్డు ఖచ్చితమైన సమయం, ఛార్జీలను ఇంకా ప్రకటించాల్సి ఉందని అధికారులు తెలిపారు. బెంగుళూరు వెళ్లి, తిరిగి వచ్చే ప్రయాణీకులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని పలువురు అంటున్నారు. మరోవైపు ఈ రైలు వల్ల కర్ణాటక రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని కర్ణాటక రైల్వే అధికారులు అంటున్నారు. రాయచూర్(raichur), కళ్యాణ కర్ణాటక ప్రాంతం మీదుగా నడిపితే బాగుంటుందని కోరుతున్నారు.