»Etawah Smoke In Coach Vande Bharat Express Stopped By Stopping Railway Power Supply
Vandebharat : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. రైలులో వందలాది మంది ప్రయాణికులు
ఢిల్లీ-హౌరా రైల్వే మార్గంలో బనారస్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో కలకలం రేగింది.
Vandebharat : ఢిల్లీ-హౌరా రైల్వే మార్గంలో బనారస్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో కలకలం రేగింది. హడావుడిగా రైల్వే అధికారులు రైల్వే విద్యుత్ సరఫరా (ఓఈసీఐ)ని నిలిపివేసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. పొగలు వచ్చిన కోచ్‌ను రెండుసార్లు తనిఖీ చేశారు. అంతా బాగానే ఉందని తెలుసుకున్న తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పంపించారు. ఆ సమయంలో రైలు దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది.
హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బనారస్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తోంది. ఇటావా జిల్లాకు చేరుకున్నప్పుడు, ఎక్స్‌ప్రెస్ కోచ్ నుండి పొగలు వస్తున్నట్లు రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. కోచ్‌లో నుంచి పొగలు రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలును హడావుడిగా రైల్వే గేటు దగ్గర ఆపారు. కోచ్‌ను తనిఖీ చేసి, ఆపై రైలును ఇటావా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి, కోచ్‌ను మళ్లీ తనిఖీ చేశారు. సంతృప్తి చెందిన తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీకి పంపించారు. చదవండి:Padma Vibhushan: మెగాస్టార్‌కి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం ఉదయం 11:03 గంటలకు ఇక్డిల్ రైల్వే స్టేషన్ నుండి ఇటావా వైపు బయలుదేరింది. ఇంతలో రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న గూడ్స్ రైలు కండక్టర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నుండి పొగలు రావడాన్ని చూశాడు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ఊహించిన గూడ్స్ రైలు ఆపరేటర్ రైల్వే కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. సమాచారం కలకలం సృష్టించింది. వెంటనే రైల్వే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరఫరా నిలిచిపోయిన తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.22 గంటలకు ఇటావా సమీపంలోని సుందర్పూర్ రైల్వే గేట్ దగ్గర ఆగింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగిన వెంటనే రైల్వే అధికారులతో పాటు రైల్వే టీఎస్ఆర్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. టీఆర్ఎస్ బృందంలోని ఎస్ఎస్సీ విపిన్‌కుమార్ తన బృందంతో కలిసి కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ పొగను వెదజల్లుతున్న కోచ్ నంబర్ 14ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి మంటలు లేదా పొగలు సంభవించకపోవడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇటావా రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. మళ్లీ తాజాగా రైల్వే అధికారులు క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. కోచ్‌లో ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో రైలును పంపించారు.