Don't give platform to terrorists, criminals: Government to TV news channels
Government to TV news channels: న్యూస్ ఛానెల్స్ (news channels) నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. తీవ్రమైన నేరాల్లో నిందితులు ఉన్న వారు, ఉగ్రవాదులు, ప్రభుత్వం బహిష్కరించిన సంస్థలకు చెందిన వ్యక్తులను ఇకపై టీవీ చర్చ వేదికల్లో అవకాశం ఇవ్వొద్దని స్పష్టంచేసింది. భారత సమాచార ప్రసార శాఖ ప్రకటన చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇటీవల ఉగ్రవాదం, తీవ్రమైన నేరాల కేసుల ఉన్న ఓ వ్యక్తిని టీవీ ఛానెల్ చర్చకు ఆహ్వానించింది. ఆ విషయం దృష్టికి రావడంతో వెంటనే టీవీ ఛానెల్స్‌కు ఐఅండ్‌పీఆర్ మార్గనిర్దేశకాలు జారీచేశాయి.
చర్చకు వచ్చిన వ్యక్తి భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతకు విఘాతం కలిగించేలా మాట్లాడాడని ప్రస్తావించింది. ఆ వ్యాఖ్యలు ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. పత్రికా స్వేచ్చను ప్రభుత్వం సమర్థిస్తోందని తెలిపింది. ఛానెల్స్ ప్రసారం చేసే కంటెంట్ కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టంచేసింది.
ఇకపై టీవీ ఛానెల్స్ ఉగ్రవాదం, నిషేధించిన సంస్థలకు చెందిన వ్యక్తుల పట్ల కఠినంగా ప్రవర్తించాలని కోరింది. అలాంటి వారిని చూపించొద్దు, వారి గురించి ప్రస్తావించొద్దని మరోసారి తేల్చిచెప్పింది. దేశ భద్రత, అంతర్గత వ్యవహారాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని.. తక్కువ చేసి, అంతర్జాతీయ సమాజంలో చులకన చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పింది. ఇటీవల సమాచార ప్రసార శాఖ 16 మంది యాంకర్లతో చర్చలు జరపొద్దని కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉగ్రవాదులు, సంస్థలతో సంబంధం ఉన్న వారితో ఇంటర్వ్యూలు వద్దని తేల్చిచెప్పింది.