Pathankot: గ్రామాల్లో సంచరిస్తున్న సాయుధ ఉగ్రవాదులు
పఠాన్ కోట్ జిల్లాలో ఉన్న భారత వాయుసేన కీలక స్థావరం దగ్గర ఇద్దరు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు.
Pathankot: పఠాన్ కోట్ జిల్లాలో ఉన్న భారత వాయుసేన కీలక స్థావరం దగ్గర ఇద్దరు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు. చాలా గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో వెంటనే బీఎస్ఎఫ్తో పాటు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకు అలర్ట్లు జారీ చేశామన్నారు. ఇద్దరు సాయుధులు కోట్ భట్టియాన్ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతం జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాతో సరిహద్దుగా ఉంది.
అనుమానితులు కూడా కథువాలోని కోట్ పన్నూలో సంచరించినట్లు తెలిపింది. ఈ నెల 12వ తేదీన పాక్ నుంచి కథువా జిల్లా సుక్పాల్ గ్రామంలోకి చొరబడిన ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. గతంలో ఓసారి వాయుసేన స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అక్కడే తప్పించుకుని తిరిగారు. తెల్లవారుజామున సిబ్బంది క్వార్టర్స్లోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.