»Double Ismart Ram Rampage In Every Mass Gully In 50 Days
Double Ismart: 50 రోజుల్లో ప్రతి మాస్ గల్లీలో రామ్ ర్యాంపేజ్!
లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేస్తున్న సీక్వెల్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్టేడ్ ఇచ్చారు. మరో 50 రోజుల్లో మాస్ జాతర మొదలు కానుందని అన్నారు.
Double Ismart: Ram rampage in every mass gully in 50 days!
Double Ismart: కల్కి తర్వాత సెప్టెంబర్ 27న వస్తున్న పెద్ద సినిమా దేవర. కానీ మధ్యలో తెలుగు నుంచి మంచి హైప్‌తో వస్తున్న సినిమాగా డబుల్ ఇస్మార్ట్ ఉంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి.. అంచనాలు గట్టిగా ఉన్నాయి. పైగా ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ అవడంతో మరోసారి రామ్ మాస్ ర్యాంపేజ్ చూడడానికి రెడీగా ఉన్నారు అభిమానులు. పలు వాయిదాల అనంతంరం డబుల్ ఇస్మార్ట్‌ను ఆగష్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో.. సరిగ్గా ఈ సినిమా రిలీజ్‌కు మరో 50 రోజులు మాత్రమే ఉందని అప్టేట్ ఇచ్చారు మేకర్స్.
మరో 50 రోజుల్లో ప్రతి గల్లీకి మాస్ గల్లీ సినిమాని తీసుకువస్తున్నాం.. ఉస్తాద్ రామ్ డబుల్ ఇస్మార్ట్ థియేటర్లను బ్లాస్ట్ చేస్తుందని.. సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే.. దానికంటే ముందే మాస్ జాతరకు రెడీ అవుతున్నారు రామ్ ఫ్యాన్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సారి మాస్ మ్యూజిక్ జాతర ఉండబోతుంది.. వేచి ఉండండి.. అంటూ స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్ లుక్‌ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఇస్మార్ట్ శంకర్‌కు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. సీక్వెల్‌కు కూడా మాసివ్ మ్యూజిక్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా.. పూరి, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉంటుందో చూడాలి.