»Jammu And Kashmir Dsp Adil Mushtaq Who Is In Touch With The Terrorists
Jammu and Kashmir: ఉగ్రవాదులతో టచ్ లో ఉన్న జమ్మూకశ్మీర్ డీఎస్పీ
ప్రభుత్వం తరుపున విధులు నిర్వర్తించాల్సిన పోలీసు అధికారి ఉగ్రవాదుల చేతిలో కీలు బొమ్మ అయ్యాడు. డబ్బుకు కక్కుర్తి పడి టెర్రరిస్ట్‌లకు సలహాలు ఇస్తూ ఊడిగం చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
Jammu and Kashmir DSP Adil Mushtaq who is in touch with the terrorists
Jammu and Kashmir: పోలీసు అధికారి అయి ఉండి ఉగ్రవాదుల(terrorists) నుంచి ప్రజలను కాపాడాల్సింది పోయి వారికే సాయం చేశాడు. డబ్బు ఆశతో వారితో చేతులు కలిపి చట్టాల నుంచి పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో టెర్రరిస్ట్‌లకు సలహాలు ఇచ్చిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ(Jammu and Kashmir DSP) షేక్ ఆదిల్ ముస్తాక్(Sheikh Adil Mushtaq) ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను కాపాడే ప్రభుత్వ ఉద్వోగి ఉగ్రవాదులకు కోవర్టుగా మారి ఎప్పటికప్పుడు వారితో టచ్‌లో నేరాల నుంచి తప్పించుకోవడానికి సాయపడుతూ ఉండేవాడు ఆరోపించారు. గతంలో పట్టుబడ్డ ఓ తీవ్రవాదిని అడిగితే డీఎస్పీ ఆదిల్ ముస్తాక్ నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది.
ఆ ఉగ్రవాదిని ప్రశ్నించగా ఆదిల్ ముస్తాక్ తో నిరంతరం టచ్ లో ఉన్నా విషయం ఒప్పుకున్నాడని ఉన్నతాధికారులు అన్నారు. అతని సెల్ ఫోన్‌ను పరిశీలించగా డీఎస్పీ ఆదిల్ ముస్తాక్ తనతో మొత్తంగా 40 గంటల పాటు మాట్లాడినట్లు బయటపడింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫోన్ కాల్స్, సందేశాలతో ఉగ్రవాదులతో ఆదిల్ అందుబాటులో ఉండేవాడని చెప్పారు. ఈ ఆధారాలతో ఆదిల్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా ఆరు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. అసలు ఉగ్రవాదులకు నగదు ఎలా చేరుతుంది అని పరశీలిస్తున్న మరో అధికారిని ఓ తప్పుడు కేసులో ఇరికించడానికి కూడా ఆదిల్ ప్రయత్నించాడని, టెర్రరిస్ట్‌లతో ఆ అధికారిపై కేసు కూడా పెట్టించాడని అధికారు వెల్లడించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. విచారణలో భాగంగా ఆ ముగ్గురిలో ఒకరు పోలీస్ ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు చేసినట్లు బయటపడిందన్నారు.
కేసును తప్పుదోవ పట్టించేందుకు దీనికి సంబంధించి ఓ ఫిర్యాదును కూడా ఆదిల్ సృష్టించాడని పేర్కొన్నారు. అక్రమ డబ్బుకు అలవాటు పడిన అదిల్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారుల నుంచి బలవంతంగా నగదు వసూళ్లు చేసేవాడని, చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీపై ఉన్న అన్ని ఆరోపణలను విచారణ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు ఆయనను జమ్ము కశ్మీర్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.