Devisree Prasad: హైదరాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో.. ఎప్పుడంటే?
భారత దేశవ్యాప్తంగా దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా మన హైదరాబాద్ నుంచే మొదలుపెడుతున్నట్లు తెలిపారు. మరీ కాన్సెర్ట్ ఎప్పుడూ, టికెట్లు తదిర అంశాలు కూడా వెల్లడించారు.
Devisree Prasad: హైదరాబాద్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. జూలై 14 న రాక్‌స్టార్ డీఎస్పీ తన సోషల్ మీడియా ఖాతాలో #DSPLiveIndiaTour ఉంటుందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే మొదటి ప్రదర్శన హైదరాబాద్ నుంచి ఇస్తున్నట్లు ఆ తరువాత దేశం అంతా తన కాన్సెర్ట్ ఉంటుందని వెల్లడించారు. 25 సంవత్సరాలుగా సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించారు డీఎస్పీ. అయితే గతంలో ఎన్నో సార్లు ఇతర దేశాల్లో ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేశారు కానీ తొలిసారిగా ఈ గడ్డపై మొదలుపెట్టారు.
తెలుగు, తమిళం, హిందీ ఇతర భాషాల్లో సైతం సంగీతం అందించారు. ఇప్పుడు లైవ్ షో ద్వారా అభిమానులను అలరించాడానికి సిద్దం అయ్యారు. డీఎస్పీ మ్యూజిక్, ఎనర్జీ గురించి అందరికీ తెలుసు. #DSPLiveIndiaTour ప్రొగ్రామ్‌ను, ACTC అనే ఈవెంట్ సంస్థ బాధ్యతలు తీసుకుంది. కన్నుల పండుగగా ఉండబోతుంది అని నిర్వాకులు పేర్కొన్నారు. ఈ హై వోల్టేజ్ కాన్సెర్ట్‌లో పాల్గొనాలంటే ACTC సంస్థ తన అధికారిక వెబ్సైట్లో టికెట్లను అందిస్తోంది. అక్టోబర్ 19న జరగబోయే కాన్సెర్ట్ కోసం ACTC ఈవెంట్స్ కోసం జూలై 14 నుంచే టికెట్లను అందుబాటులో ఉంచారు. www.actcevents.com ఈ వెబ్సైట్ లేదా Paytm ఇన్‌సైడర్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
Get ticket updates for Rockstar DSP Live in Hyderabad 🤘. @ThisIsDSP