Sai Durga Tej: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో సాయి దుర్గా తేజ్
ఇటీవలే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన చైల్డ్ అబ్యూసింగ్ అలాగే తండ్రీకూతుళ్ల బంధంపై ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. ఫలితంగా నిందితుడిని అరెస్ట్ చేసింది. ఈ విషయం వెంటనే స్పందించినందకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Sai Durga Tej: ఇటీవలే ఓ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఓ యూట్యూబర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అభ్యంతరకరమైన చిట్ చాట్ నిర్వహించారు. అందులో ఓ తండ్రి, కూతురుకు సంబంధించిన వీడియోపై దారుణమైన కామెంట్స్ చేశారు. దీనిపై హీరో సాయి దుర్గ తేజ్ స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ సహా, గిరిజన సంక్షేమ మంత్రి సీతక్క తదితర నాయకులు స్పందించారు.
ఆ వీడియోను జత చేస్తే పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెట్టే తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని అన్నారు. అదే విధంగా ఇలాంటి కామెంట్లు చేసే వారిని, సోషల్ మీడియాలో అరాచకాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఆ తరువాత జరిగిన రచ్చ గురించి తెలిసిందే. దాంతో బెంగళూరు పోలీసులు ప్రణీత్ హనుమంత్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈ అంశంలో సాయి దుర్గ తేజ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు.
“నా కోసం మీ విలువైన సమయం కేటాయించినందుకు థాంక్యూ సీఎం రేవంత్ అన్న.. పిల్లలపై అకృత్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం ఇతర అంశాలపై నన్ను అడగడం, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నదానిపై నాతో చర్చించినందుకు మీకు ధన్యవాదాలు. మన సమాజంలో పిల్లలను సురక్షితంగా పెరగడానికి తగిన వాతావరణం కల్పిస్తామని, అందుకోసం కఠినమైన నిబంధనలు, చర్యలకు శ్రీకారం చుడతామన్నారు. సత్వరమే స్పందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సమస్యలపై నా సర్వశక్తులా పోరాడుతాను. అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా చర్చించినట్లు ఆయన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Thank you Hon'ble Chief Minister @revanth_anumula Anna for giving me your valuable time to listen, understand and discuss the way forward to curb child abuse & misuse of social media for the same filth.