డాటర్స్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాల్గవ ఆదివారం జరుపుకుంటాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాటర్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే భారత్లో దేవతలను పూజించినా..పలు చోట్ల ఇప్పటికే ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూతుళ్లు కొడుకుల కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు.
ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుందని చెబుతుంటారు. అంతేకాదు ఆడపిల్లను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆడపిల్ల లేని ఇల్లు నిండుగా ఉండదని అంటుంటారు. అంతేకాదు తల్లిదండ్రుల సమస్యలను అర్థం చేసుకోవడంలో అమ్మాయిల కంటే బాగా ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరని చెప్పావచ్చు. ఎవరైనా వారికి కీర్తి, ప్రతిష్ట వచ్చిందని చెబితే వారి విషయంలో ఓ మహిళ పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇలా ప్రతి అంశంలో కూడా అడపిల్ల లేని జీవనం లేదు, ఉండదు. అలాంటి అడపిల్లల విషయంలో వివక్ష చూపించకండి. వారిని స్వేచ్ఛగా బతకనివ్వండి. వారు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఇప్పటికే అనేక రంగాల్లో నిరూపించారు. అయితే ఈరోజు(సెప్టెంబర్ 24న) డాటర్స్ డే సందర్భంగా అడపిల్లలందరికీ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు సందర్భంగా మీకు కొన్ని సందేశాలు ఇక్కడ అందజేస్తున్నాం.
కుమార్తెలు జీవితంలో చాలా ప్రత్యేకం,
వారితో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది
దీనికి ప్రతి ఒక్కరూ గర్వపడాలి,
ఎందుకంటే కూతురే మన జీవితానికి ఆధారం!
– హ్యాప్పీ డాటర్స్ డే
తల్లిదండ్రుల బాధను సరిగ్గా అర్థం చేసుకునేది కూతుళ్లు
ఇంటిని ప్రకాశవంతం చేసేది కుమార్తెలు
అలాంటి ఆడపిల్లలను కాపాడుకుందాం
సమాజంలో వారి విలువలకు స్వేచ్ఛనిద్దాం
– హ్యాప్పీ డాటర్స్ డే
కూతురు భారం కాదు ఆసరా
ఆమె లేని ఇళ్లు ఉండదు
కూతురే జీవితానికి ఆధారం
– హ్యాపీ డాటర్స్ డే
కూతుర్తె అంటే ఒక సంస్కృతి
కుమార్తె ఒక వారసురాలు
కుమార్తె ఒక సంతోషకరమైన బహుమతి
అలాంటి కుమార్తెలందరికీ డాటర్స్ డే శుభాకాంక్షలు