»Man Wearing Burqa Dances Ganesh Procession In Tamil Nadu
Burqa వేసుకొని మరీ డ్యాన్స్, యువకుడు అరెస్ట్
వినాయక నిమజ్జనం సందర్భంగా తమిళనాడులో అరుణ్ కుమార్ అనే వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలైంది. ముస్లిమ్స్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేసి అరుణ్‌ను అరెస్ట్ చేశారు.
Man Wearing Burqa: దేశంలో ఒక్కోచోట వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గణనాథుడిని సాగనంపే సమయంలో డ్యాన్స్ చేస్తూ.. వీడ్కోలు పలుకుతారు. డ్రింక్ చేసి మరీ స్టెప్పులు వేస్తుంటారు. మరికొందరి డ్రెస్సింగ్ వెరైటీగా ఉంటుంది. తమిళనాడులో కూడా ఓ వ్యక్తి డ్యాన్స్ (Dance) చేసి.. అరెస్ట్ అయ్యాడు.
విరుథమ్పట్టులో వినాయక నిమజ్జనం కొనసాగింది. అరుణ్ కుమార్ (arun kumar) అనే వ్యక్తి బుర్ఖా వేసుకొని మరీ డ్యాన్స్ చేశాడు. మిగతా ఫ్రెండ్స్ మాములుగా స్టెప్పులు వేసుకున్నారు. అందులో ఓ కుర్రోడు జొమాటో డెలివరీ (zomato delivery) బ్యాగ్ భుజాన వేసుకొని మరీ ఎగిరి గంతేశాడు. ఆ వీడియో కొందరు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ఒకతను బురఖా (burqa) వేసుకొని డ్యాన్స్ చేశాడని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21వ తేదీన ఘటన జరిగిందని కంప్లైంట్లో ప్రస్తావించారు. విచారణ జరపగా డ్యాన్స్ చేసింది అరుణ్ కుమార్‌గా (arun kumar) గుర్తించారు. అతనిని అరెస్ట్ చేశారు. ఇరు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని.. అలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు.
ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుందని.. ఇతరుల ప్రమేయంపై ఎంక్వైరీ జరుగుతుందని తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా అరుణ్ బురఖా ధరించి డ్యాన్స్ చేసి.. కటకటాల పాలయ్యాడు. ఇతరులు ఎవరూ ఇలా చేయొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. హిందు- ముస్లిం మధ్య గొడవలకు దారితీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.