NZB: రూరల్ మండలంలోని కొండూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.