»Ont Be Like Aiadmk And Bjp Udhayanidhi Stalins Jibe While Wishing Newly Wed Couples
Udhayanidhi Stalin: బీజేపీ, అన్నాడీఎంకేలా వద్దంటూ కొత్త జంటకు విషెస్
డీఎంకే పార్టీ యువనేత, మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులో ఆదివారం సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యాడు ఈ సందర్భంగా ఆ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ... అన్నాడీఎంకే, బీజేపీ వలె మాత్రం ఉండవద్దు అంటూ హితవు పలికారు.
డీఎంకే పార్టీ యువనేత, మంత్రి (DMK Minister), సినీ నటుడు (Cine Actor) ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK), భారతీయ జనతా పార్టీల (BJP) పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులో ఆదివారం సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యాడు ఈ సందర్భంగా ఆ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ… అన్నాడీఎంకే, బీజేపీ వలె మాత్రం ఉండవద్దు అంటూ హితవు పలికారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా భారీ ఖర్చుతో 81 పెళ్లిళ్ళను జరిపించారు. కొత్తగా పెళ్లైన జంటలను ఉద్దేశించి ఉదయనిధి (Tamil Nadu Sports Minister Udhayanidhi Stalin) మాట్లాడారు. ఎవరి కాళ్ల పైన కూడా పడవద్దని సూచించారు. మీరు ఎవరికీ బానిసలు కాదని, ఇది ఆత్మగౌరవ వివాహం అని చెప్పారు. మీ హక్కులను మీరు డిమాండ్ చేసి సంపాదించుకోవాలన్నారు. పిల్లలు పుట్టినప్పుడు వారికి తమిళ పేర్లు వచ్చేలా పెట్టాలని సూచించారు. హిందీ భాషను ఆపాలంటే మనం ఇలాంటివి చేయాలని వ్యాఖ్యానించారు.
అంతకుముందు కూడా ఓ పెళ్లికి హాజరై కొత్తగా పెళ్లైన జంటలను ఉద్దేశించి పన్నీరు సెల్వం, ఎడప్పాడి పళనిసామిలా జీవించవద్దని సూచించారు. పెళ్లైన కొత్త జంట ఎలా జీవించవద్దో నేను చెబుతానని, నేను రాజకీయాలు మాట్లాడకుండా ఉండలేను అని చెప్పాడు. తమిళనాడులో ఏం జరుగుతుందో మీకందరికీ తెలుసునని, పళనిసామి, పన్నీరు సెల్వంలా ఉండవద్దని చెప్పారు. మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కోల్పోవద్దన్నారు. డిమాండ్ చేసి, హక్కును సంపాదించుకోవాలన్నారు.