తన బట్టతలపై వచ్చే విమర్శలను తిప్పికొట్టి, జాతీయ అవార్డులతో మెప్పించిన విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ తన అనుభవాలను పంచుకున్నారు. తనను అంకుల్ అని పిలువొద్దని ఏకే లేదా అనుపమ్ గారు అని పిలవాలని యువతను కోరారు. ఎంతోమంది డాక్టర్లు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామన్నా ఆయన నిరాకరించారు. ప్రస్తుతం ఆయన నటించిన ఘోస్లా 2 చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది.