CTR: సదుంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు ఆయనను కలుసుకున్నారు. వారికి ఎమ్మెల్యే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఖాజాపీర్, కాలేశా తదితరులు పాల్గొన్నారు.