»No Discussion On Ec Decision Sharad Pawar Advice To Uddhav Thackeray
pawar Advice To Uddhav:ఈసీ డిసిషన్ ఫైనల్.. సుప్రీంకు వెళ్లొద్దు:ఉద్దవ్‌కు పవార్ హితబోధ
pawar Advice To Uddhav:ఉద్దవ్ థాకరేకు (Uddhav Thackeray) ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) సుప్రీంకోర్టులో (supreme court) సవాల్ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఇక దానిపై చర్చ అనవసరం అని శరద్ పవార్ సూచించారు.
pawar Advice To Uddhav:ఉద్దవ్ థాకరేకు (Uddhav Thackeray) ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివసేన పార్టీ, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. దీంతో ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) ఆలోచనలో పడ్డారు. కార్యకర్తలకు ధైర్యం నింపుతూనే.. కార్యచరణపై ఫోకస్ చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో (supreme court) సవాల్ చేస్తానని ప్రకటించారు. ఇంతలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (sharad pawar) ఎంట్రీ ఇచ్చారు. శివసేన పార్టీ, గుర్తు విషయంలో కీలక సూచన చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆమోదించాలని ఉద్దవ్‌ను కోరారు. కొత్త పార్టీ గుర్తు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రభావం చూపించదని, ప్రజలు కొత్త గుర్తును ఆమోదిస్తారని శరద్ పవార్ తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఇక దానిపై చర్చ అనవసరం.. ఆమోదించి కొత్త గుర్తు తీసుకోవడమే ఉత్తమం అని పవార్ పేర్కొన్నారు.
ఇందిరా గాంధీకి కూడా
ఇందిరాగాంధీకి (Indira gandhi) కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీకి గతంలో కాడితో కూడిన రెండు ఎద్దుల గుర్తు ఉండేది. తర్వాత దాన్ని కోల్పోవడంతో హస్తం గుర్తు లభించింది. దానిని ప్రజలు ఆమోదించారు. ప్రజలు ఉద్దవ్ థాకరే పార్టీకి సంబంధించి కొత్త గుర్తును స్వీకరిస్తారు అని పవార్ పేర్కొన్నారు.
షిండేదే అసలైన శివసేన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేదే (ekanth shinde) అసలైన శివసేన అని అధికారికంగా గుర్తించింది. ధనుస్సు (bow), బాణం (arrow) గుర్తును కూడా షిండే వర్గానికి కేటాయించింది. శివసేన పార్టీలో సంక్షోభం ఏర్పడి అసమ్మతి వర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తమదే అసలైన శివసేన అని ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాలు ప్రకటించుకున్నాయి.
బాలాసాహెబ్ భావజాలం
ఈసీ తాజా నిర్ణయంతో సీఎం ఏక్ నాథ్ షిండే (eknath shinde) హర్షం వ్యక్తం చేశారు. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే భావజాలం సాధించిన విజయం అని అభివర్ణించారు. ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ప్రాతిపదికగా తీసుకుంటారని స్పష్టం చేశారు. తమదే నిఖార్సయిన శివసేన (shivasena) అని తేలిందని పేర్కొన్నారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకునే తాము గతేడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని షిండే వివరించారు.
It's the decision of the Election Commission. Once a decision is given, there can be no discussion. Accept it & take a new symbol. It (loss of old symbol) is not going to have any major impact as people will accept (new symbol): NCP Chief Sharad Pawar
ఇలా ఇచ్చారు..
ఏ ప్రాతిపదికన శివసేన (shivasena) పార్టీపై నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ఈసీ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరఫున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారని, వారందరి మద్దతు ఏక్ నాథ్ షిండేకు ఉందని వివరించింది. ఉద్ధవ్ థాకరే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని పేర్కొంది. ఈసీ నిర్ణయంపై ఉద్దవ్ థాకరే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈసీ నిర్ణయం ఊహించినదేనని, తాము కొత్త గుర్తుతో ముందుకెళతామని వెల్లడించారు. దీంతో తామేమీ బాధపడటం లేదన్నారు. ప్రజలతో తమ వెంటే ఉన్నారని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.