Patiala Jail : జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రిలీజ్
కాంగ్రెస్ నేత (Congress leader), మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్దూకు విముక్తి కలిగింది. సత్ర్పవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు. పాటియాలా జైలు (Patiala Jail) నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
కాంగ్రెస్ నేత (Congress leader), మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu) 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్దూకు విముక్తి కలిగింది. సత్ర్పవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు. పాటియాలా జైలు (Patiala Jail) నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జైలు ముందు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు డోలు మోగిస్తూ డ్యాన్సులు చేశారు. 1988లో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్ సింగ్(Rupinder Singh)… ఓ పార్కింగ్ వివాదంలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిపై చేయిచేసుకున్నట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష(Imprisonment) పడింది. ఈ కేసు (1988 road rage case) లోనే సిద్ధూకి సుప్రీంకోర్టు ( Supreme Court ) సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది.
ఈ ఏడాది మే వరకు ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే, సత్ప్రవర్తన కారణంగా ఆయన దాదాపు 50 రోజుల ముందుగానే విడుదల అయ్యారు. దాంతో ఆయన గతేడాది కోర్టు ఎదుట లొంగిపోయాడు. ఇటీవల సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ బారినపడింది. ఈ కష్టకాలంలో భర్త తన వెంట ఉండాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. కాగా, సిద్ధూ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయన రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పంజాబ్ (Punjab) ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం పంజాబ్ పీసీసీ చీఫ్ (PCC chief) పదవి నుంచి సిద్ధూ తప్పుకున్నారు. అటు, పార్టీలో లుకలుకల నేపథ్యంలోనూ ఆయన కాంగ్రెస్ (Congress) హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు.
#WATCH | Congress leader Navjot Singh Sidhu released from Patiala jail, approximately 10 months after he was sentenced to one-year jail by Supreme Court in a three decades old road rage case pic.twitter.com/kzVB2vMnpk
#WATCH | Patiala: Whenever a dictatorship came to this country a revolution has also come and this time, the name of that revolution is Rahul Gandhi. He will rattle the govt: Navjot Singh Sidhu soon after his release from Patiala jail pic.twitter.com/wkrBrObxDG