»Kolkata Girl Fakes Kidnapping After Scoring Less Marks In Exam
Kolkata girl: ఈ అమ్మాయి తెలివి మాములుగా లేదుగా.. మార్కులు తక్కువ వచ్చాయని
పదో తరగతి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. తన ఆరేళ్ల చెల్లెలిని తీసుకొని వెళ్లి.. తండ్రికే మెసేజ్ చేసింది. రూ.కోటి ఇస్తేనే వదులుతానని చెప్పింది.
Kolkata girl fakes kidnapping after scoring less marks in exam
Kolkata girl: పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత తిడతారు.. అదే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే జాలి ఏర్పడుతుంది.. ఇదీ ఓ సినిమాలో డైలాగ్.. అచ్చం ఇలానే ఓ విద్యార్థిని చేసింది. ఆమె ఫెయిల్ కాలేదు.. కానీ తక్కువ మార్కులు వచ్చాయి. ఇంకేముంది ఇంటి నుంచి తన చెల్లిని కూడా తీసుకెళ్లింది. వెళ్లి తన తండ్రికి మెసేజ్ చేసింది. చెల్లితోపాటు వెళ్లిన ఆమె.. తనను ఎవరో కిడ్నాప్ చేశారని అందులో పేర్కొంది. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేసింది.
పశ్చిమ బెంగాల్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి ఫలితాలను శుక్రవారం రిలీజ్ చేసింది. బాండ్రొని ఏరియాకు చెందిన విద్యార్థిని పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదలయిన వెంటనే కేఫ్‌కు (cyber cafe) వెళ్లి రిజల్ట్ చూసుకుంది. మార్కుల లిస్ట్ డౌన్ లోడ్ చేసుకుంది. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లింది. పేరంట్స్ ఫోన్ చేస్తే ఆన్ రిచెబుల్ అని వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు (police) సీసీ కెమెరా ఫుటేజీ చూశారు. బాలికల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆ బాలిక స్కూటీ (scooty) మెట్రో స్టేషన్ వద్ద కనిపించింది. పోలీసుల విచారణ జరుగుతుండగా.. ఆమె తండ్రికి వరసగా మెసేజ్ వస్తున్నాయి. డబ్బులు తీసుకొని నేపాల్ గంజ్ ఏరియాకు రావాలని అందులో సారాంశం.
సీల్దా రైల్వేస్టేషన్ నుంచి కృష్ణా నగర్ లోకల్ రైలు ఎక్కొచ్చని పోలీసులు అనుమానించారు. రైల్వే పోలీసులు, కృష్ణా నగర్ జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకున్నారు. ఆ బాలికల ఫోటోలను పంపించగా.. నదియా జిల్లాలో గల డివైన్ నర్సింగ్ హోమ్ ముందు బాలికలను పోలీసులు గుర్తించారు. అక్కడినుంచి వారిని పోలీసు స్టేషన్ తీసుకొచ్చారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటలేదని.. కేవలం 31 శాతం మార్కుల సాధించడంతో బాలిక ఇలా చేశానని పోలీసులతో చెప్పింది. చెల్లెలిని తీసుకొని వెళ్లింది. డబ్బులు కావాలని సొంత తండ్రికే మెసేజ్ చేసింది.