»Kharge To Meet Sonia Rahul And Discuss Karnataka Clp Leader
Sonia, Rahulతో ఖర్గే భేటీ.. కర్ణాటక సీఎల్పీ నేత ఎంపికపై చర్చ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశం అవుతారు. అక్కడ సీఎల్పీ నేత గురించి చర్చించి.. ఎన్నుకుంటారు.
Kharge To Meet Sonia, Rahul and Discuss Karnataka CLP Leader
Kharge To Meet Sonia, Rahul:కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. 136 స్థానాలు గెలిచి కమల దళాన్ని షేక్ చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎల్పీ నేతను ఎన్నుకోవాల్సి ఉంది. కర్ణాటక కాంగ్రెస్లో సీఎం పదవీ కోసం మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ధ రామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య పోటీ ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (kharge) ఢిల్లీ వెళ్లారు.
సోనియా గాంధీ (sonia gandhi), రాహల్ గాంధీతో (rahul gandhi) ఖర్గే భేటీ అవుతారు. సమావేశంలో ప్రియాంక గాంధీ (priyanka gandhi) కూడా పాల్గొంటారని తెలిసింది. కర్ణాటక సీఎల్పీ నేత గురించి డిస్కష్ చేస్తారు. వారి ఆమోదంతో కర్ణాటకలో ఉన్న కేసీ వేణుగోపాల్ (kc venugopal), రణదీప్ సింగ్ సుర్జేవాలాకు (surgewala) సమాచారం ఇస్తారు. సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేల సమావేశం జరగనుండగా.. అక్కడ సీఎల్పీ నేతను ప్రకటిస్తారు.
సిద్దరామయ్యకు సీఎం పదవీ ఇస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ప్రధానంగా మైనార్టీ ఓట్లను రాబట్టడంలో సిద్దరామయ్య చేసిన క్యాంపెయిన్ పనికి వచ్చింది. అలాగని డీకే శివకుమార్ (DK Shivakumar) ఏమీ తక్కువ కాదు. పార్టీని సవ్యంగా నడిపించారు. అసంతృప్తులను కూల్ చేయడం.. క్యాంపు రాజకీయాలు నిర్వహించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరకంగా చూస్తే.. సీఎం పదవీకి ఇద్దరు అర్హులే. మరీ పదవీ ఎవరినీ వరిస్తుందో మరికొద్దీ గంటల్లో తేలనుంది.
కర్ణాటక ఫలితాలు వెలువడిన వెంటనే సిద్ధారామయ్యకే సీఎం అవకాశాలు ఉన్నాయని ఆయన కుమారుడు యతీంద్ర ప్రకటన చేశారు. డీకే శివకుమార్ (DK Shivakumar) నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. కష్టపడిన వారికే పదవీ దక్కుతుందని ఆయన మాటల ద్వారా తెలిసింది. అంటే తనకే సీఎం పదవీ దక్కాలని ఇండైరెక్టుగా చెబుతున్నారు.