మొన్న చంద్రయాన్-3, (Chandrayaan-3) ఇవాళ ఆదిత్య L1 సక్సెస్ కావడంతో ఇస్రోపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఇస్రో (ISRO)సైంటిస్టులను మోటివేట్ చేస్తున్న అంశమేమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనికి మిషన్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ‘ప్రతి సాయంత్రం మసాలా దోశ, ఫిల్టర్ కాఫీయే మా విజయ రహస్యం. ఇప్పుడు అకస్మాత్తుగా అందరికీ వీటి మీద ఆసక్తి పెరిగింది’ అని ఆయన తెలిపారు.
ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ (Madhavan Nair) మాట్లాడుతూ.. తమ శాస్త్రవేత్తలు సాధారణ జీవితాన్నే గడుపుతారని అన్నారు. ‘వారెప్పుడు డబ్బును పట్టించుకోరు. ఏకాగ్రత మొత్తం మిషన్పైనే ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని నిపుణుల జీతాల్లో ఐదో వంతు మాత్రమే తీసుకునే మన(ISRO) శాస్త్రవేత్తలు.. ఈ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు’ అని వెల్లడించారు.ఇంతటి చరిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న మన శాస్త్రవేత్తలు (Scientists) చప్పట్లతోనే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అంతేతప్ప ఆ హడావుడి బయట ఎక్కడా కనిపించదు. తమ పనిగంటలు ముగిసిన తర్వాత కూడా అదనపు సమయాన్ని ప్రాజెక్టు పూర్తి చేయడానికే కేటాయిస్తుంటారు.