»Irs Officer Irs Has Changed Into A Man For The First Time In The History Of Civil Services
IRS Officer: ఐఆర్ఎస్ ఆమె అతడుగా మార్పు.. సివిల్ సర్వీసెస్ చరిత్రలో మొదటిసారి!
దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ ఐఆర్ఎస్ అధికారిణి ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్పు చేశారు. పుట్టుకతో స్త్రీగా ఉన్న తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు.
IRS Officer: IRS has changed into a man.. for the first time in the history of civil services!
IRS Officer: దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ ఐఆర్ఎస్ అధికారిణి ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్పు చేశారు. పుట్టుకతో స్త్రీగా ఉన్న తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు. చెన్నైకు చెంది ఐఆర్ఎస్ అధికారి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో తను ఎం.అనుకతిర్ సూర్యగా పేరు, పురుషుడిగా లింగం మార్చాలని కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని అధికార రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నామని తెలిపింది.
2014లో లింగ మార్పిడికి సంబంధించిన నల్సా కేసు సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఒడిశాకు చెందిన ఓ వాణిజ్య పన్ను అధికారి విధుల్లో చేరిన ఐదేళ్ల తర్వాత తాను లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నానని తనను స్త్రీగా గుర్తించాలని కోరారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెల్లడిస్తూ వ్యక్తులు తాము పురుషులుగా ఉండాలా? స్త్రీగా ఉండాలా అనేది వాళ్ల వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. దీనిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో ఆ అధికారి తన పేరును ఐశ్వర్య రీతుపర్ణ ప్రధాన్గా రికార్డుల్లోకి మార్చుకున్నారు.