గుజరాత్లో ఓ మహిళా కానిస్టేబుల్ (woman constable) గొప్ప మానవత్వం చాటుకున్నది. ఓ మహిళాకానిస్టేబుల్ తన 6 నెలల కొడుకుతో కలిసి ‘గుజరాత్ హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్’ పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె ఎగ్జామ్ (Exam) అయ్యేవరకూ చిన్నారిని కంటికి రెప్పలా చూసుకుంది మరో మహిళా కానిస్టేబుల్. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే.. తల్లికి అండగా నిలబడటాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్(Ahmedabad)లోని ఓధవ్లో గుజరాత్ ‘హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్’ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు కానిస్టేబుల్ తన 6 నెలల చిన్నారితో కలిసి వచ్చింది.
ఓ వైపు ఎగ్జామ్ మొదలు అవుతుంటే చిన్నారి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ పరిస్థితుల్లో పరీక్ష రాయడం అంటే ఆమెకు సవాల్ లాంటిది. ఇక పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ దయా బెన్ రంగంలోకి దిగి ఆ చిన్నారిని తన దగ్గరకు తీసుకుని ఆమె పరీక్షకు హాజరయ్యేందుకు సాయం చేసింది. కానిస్టేబుల్ చిన్నారితో ఆడుకుంటున్న ఫోటోలు అహ్మదాబాద్ పోలీసులు ట్విట్టర్ అకౌంట్ లో (@AhmedabadPolice) షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.ఇక మహిళా కానిస్టేబుల్ దయాబెన్ (Dayaben) చేసిన పనికి పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు అందాయి. ఈ క్రమంలోనే గుజరాత్ డీజీపీ (Gujarat DGP) దయాబెన్ను ప్రశంసిస్తూ ఓ లేఖను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా డీజీపీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంచి పని చేసిన ఆమెకు ఇతర పోలీసులు కూడా సెల్యూట్ చేస్తున్నారు.