WNP: తెలంగాణ సాధనలో ఉమ్మడి పాలమూరు జిల్లా కీలక పాత్ర పోషించిందని మంత్రి జూపల్లి తెలిపారు. సభలో మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో పాలమూరు అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్, ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులు, ఇప్పుడు మాట్లాడటం సమంజసం కాదన్నారు.