భూపాలపల్లి జిల్లాలో యాసంగి సీజన్‌కు 1,26,805 ఎకరాల సాగు ప్రణాళిక ఖరారైందని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వరి 97,570 ఎకరాలు, మొక్కజొన్న 29,540 ఎకరాల్లో సాగవుతుంది. వేరుశెనగ, పెసర పంటలు కూడా సాగులో ఉన్నాయి. వరికి 22,567 క్వింటాల్లు, మొక్కజొన్నకు 2,157 క్వింటాల్లు విత్తనాలు అవసరమని DPO తెలిపారు.