BDK: బూర్గంపాడు మండలంలో కిన్నెరసాని వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. సమ్మక్క-సారక్క గుడి సమీపంలో గుట్టలుగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేసి రాత్రివేళ లారీల్లో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.