Forceful Seizure Of Vehicle Recovery Is Illegal: Patna High Court
Vehicle Recovery: లోన్ తీసుకొని.. చెల్లించకుంటే సదరు వాహనం రికవరీ (Vehicle Recovery) చేస్తుంటారు. ఫైనాన్స్ (finance) సంస్థలు ముందే చెప్పి.. స్వాధీనం చేసుకుంటాయి. దీనికి సంబంధించి పాట్నా హైకోర్టు (patna high court) కీలక తీర్పునిచ్చింది. బలవంతంగా వాహనాలు రికవరీ చేయొద్దని తేల్చిచెప్పింది. బలవంతంగా వాహనం రికవరీ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చని పాట్పా హైకోర్టు సూచించింది.
రుణం, బ్యాంకు రుణం తీసుకొని కొనుగోలు చేసిన వాహనాలను బ్యాంకుల నిబంధనల మేరకు స్వాధీనం చేసుకోవచ్చు. వేలం వేయవచ్చని పేర్కొంది. రికవరీ ఏజెంట్లను పెట్టి బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ రాజీవ్ రంజన్ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. బ్యాంకులు (bank), ఫైనాన్స్ (finance) సంస్థలు ఒక్కో సందర్భంలో గన్ చూపించి, బెదిరించి బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏకసభ్య ధర్మాసనం తప్పుపట్టింది.
రికవరీ ఏజెంట్లు బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోకుండా చూడాలని ఎస్పీలను (sp) ఆదేశించింది. 5 కేసులలో ఈ నెల 19వ తేదీన విచారణ పూర్తి చేసింది. బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకున్న బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు రూ.50 వేల చొప్పున ఫైన్ వేసింది. పౌరుల హక్కులకు భంగం కలిగించే ఏ అంశంపైనా.. ప్రైవేట్ పార్టీపైనా దాఖలు చేసే పిటిషన్లను విచారించే హక్కు హైకోర్టుకు ఉందని తెలిపింది. గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పులను గుర్తుచేసింది.
ఈ తీర్పు బ్యాంకులు/ ఫైనాన్స్ సంస్థలకు ఇబ్బంది కలిగించే అంశం. వారి వ్యవస్థ రికవరీ ఏజెంట్ల ద్వారా నడుస్తోంది. ఆ వాహనాలను బ్యాంకులు, ఫైనాన్షియర్లు స్వాధీనం చేసుకొని, వేలం వేయాలని సూచించింది.. కానీ నిబంధనలు పొందుపరచలేదు.