»Governor Tamilisais Sensational Comments On The Telangana Government
Governor Tamilisai : తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సచివాలయాన్ని(Secretariat) అద్భుతంగా కట్టారని, కానీ తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని తమిళి సై చెప్పారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని అన్నారు.
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ (Pm modi) ప్రారంభించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) సౌందర్ రాజన్ సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారు. సచివాలయ (Secretariat) ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించలేదు. నాకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదు. కొత్త పార్లమెంటు (New Parliament) ప్రారంభోత్సవ అంశం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. రాష్ట్రపతే ప్రారంభించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి (President) మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా!’’ అని ఆమె అన్నారు.
ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలనే వార్తలు వినిపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వైఖరిని ప్రస్తావిస్తూ ఇక్కడే తిరకాసు ఉన్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా భావిస్తూ గవర్నర్ (Governor) విషయంలో మాత్రం రాజకీయాలతో లింక్ ఉన్నట్లుగా భావించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పదవిలో ఉంటున్న రాష్ట్రపతి రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి అని చెప్తున్న సీఎం కేసీఆర్ (CM KCR) (పరోక్షంగా ప్రస్తావిస్తూ) గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలకు చెందిన వ్యక్తులనే గవర్నర్గా నియమిస్తున్నారనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.