»Degree Studies In Maharashtra Jail 145 Prisoners Will Be Released
Jail Degree: జైలులోనే డిగ్రీ చదువు.. ఎక్కడ అంటే..?
నేరస్తుల జీవితాలు జైళ్లలోనే మగ్గిపోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయాన్ని తీసుకొని విజయవంతంగా అమలుపరుస్తుంది. దీని వల్ల సమాజంలో కలిసిపోవడానికి, ఆత్మవంచన లేకుండా బతకడానికి వారికి విద్యా అవసరాన్ని గుర్తించి సాయం చేస్తోంది.
Degree studies in Maharashtra jail.. 145 prisoners will be released
Jail Degree: మహారాష్ట్రాలో ఖైదీలకు జైళ్ల శాఖ విద్యను అందిస్తోంది. ఇది వారిలో నేరప్రవృత్తి తగ్గించేందుకు దోహపడుతుందని ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు పరుస్తుంది. డిగ్రీ పూర్తిచేసిన ఖైదీలకు వారి శిక్ష తగ్గిస్తున్నారు. అర్హత సాధించిన ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తున్నారు. 2019 నుంచి జూన్ 2023 వరకు 145 మంది ఖైదీలు విడుదలయ్యారు.
మహారాష్ట్రలో గల 10 జైళ్లలో అండర్ ట్రయల్స్, ఖైదీలకు ఎస్ఎస్సీ/ హెచ్ ఎస్సీ (SSC/HSC), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అందిస్తున్నారు. ఈ కోర్సు సులభంగా పూర్తి చేసేందుకు ఖైదీలకు స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU), యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ (YCMOU) అందించే కోర్సుల్లో ఖైదీలు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఖైదీలకు కోర్స్ మెటీరియల్స్ ఇస్తారు. చదువుకోవడానికి, సందేహాల నివృత్తి, పాఠ్యాంశాల బోధనకు జైలులో నియమితులైన ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారు. జైలులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తున్నారు. ఖైదీలు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించి విడుదలైన తర్వాత సమాజంలో మళ్లీ కలిసిపోయేందుకు అవకాశం కల్పించేందుకు మినహాయింపును అందించినట్టు జైళ్ల అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ గుప్తా తెలిపారు.