»Lalu Prasad Yadav Gets Relief In Railway Jobs Scam Case
Lalu prasad yadav: రైల్వేలో జాబ్స్ స్కాం కేసులో లాలూకు ఊరట
రైల్వేలో ఉద్యోగాల కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్(Lalu prasad yadav), ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వీ యాదవ్(Tejashwi Yadav)కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
Lalu prasad yadav gets relief in railway jobs scam case
రైల్వేలో ఉద్యోగాల కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్(Lalu prasad yadav) ఫ్యామిలీకి ఉపశమనం లభించింది. ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejashwi Yadav)కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ నిందితులకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కోర్టుకు హాజరుకావడంతో వారికి ఉపశమనం లభించింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఢిల్లీలోని అవెన్యూ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది.
అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా వివిధ నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపుతున్నాయని పేర్కొన్నారు. దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సెప్టెంబర్ 22న నిందితులకు సమన్లు జారీ చేసింది. ఆరోపించిన కుంభకోణానికి సంబంధించి ఏజెన్సీ జూలై 3న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసుతో పాటు దాణా కుంభకోణం కేసుల్లో ప్రసాద్ బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ కేసులో సీబీఐ(CBI) రెండో చార్జిషీట్ దాఖలు చేయగా..తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా పేర్కొన్న వాటిలో ఇదే మొదటిది.
2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న రైల్వేలోని వెస్ట్ సెంట్రల్ జోన్లో జరిగిన గ్రూప్-డి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో మే 18, 2022న లాలూ ప్రసాద్‌తో పాటు అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా మరో 15 మందిపై కేసు(case) నమోదు చేశారు.