98వ అకాడమీ అవార్డ్స్ కోసం ఇండియా నుంచి అధికారికంగా నామినేట్ అయిన బాలీవుడ్ చిత్రం ‘హోమ్‌బౌండ్’. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించాడు.