ATP: కుందుర్పి మండల కేంద్రంలో నాగేంద్ర అనే రైతు తనకున్న మూడు ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. పంట పొలంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ నీటి బిందు పరికరాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం తోటకు వెళ్లిన రైతు నాగేంద్ర ధ్వంసమైన బిందు పరికరాలను చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.