»Congress Mp Shashi Tharoor Came To The House With A Dictionary
Shashi : కాంగ్రెస్ ఎంపీశశి థరూర్ సభకు డిక్షనరీతో వచ్చిన ఓ వ్యక్తి..
కాంగ్రెస్ (Congress )ఎంపీ శశిథరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయెగించిన పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి (dictionary ) వెళ్లి వాటి మీనిగింగ్ చూస్తుంటారు. రీసెంట్ గా శశిథరూర్ పాల్గొన్న ఒక సభకు ఒక వ్యక్తి ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాంగ్రెస్ (Congress )ఎంపీ శశిథరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయెగించిన పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి (dictionary ) వెళ్లి వాటి మీనిగింగ్ చూస్తుంటారు. రీసెంట్ గా శశిథరూర్ పాల్గొన్న ఒక సభకు ఒక వ్యక్తి ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాబట్టి, శశిథరూర్ (Shashi Tharoor) పాల్గొనే సభకి కనుక వెళ్లినట్లైతే మీ వెంట ఒక నిఘంటువును తీసుకెళ్లడం మంచిదంటూ చమత్కరిస్తుంటారు కూడా.ఈ వీడియో (Video) షేర్ చేస్తూనే, ఇందులో అంత పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటూ నెటిజెన్లు స్పందిస్తుండడం గమనార్హం.
నాగాలాండ్‌లో ఆర్.లుంగ్‌లెంగ్ హోస్ట్ చేసిన ‘లుంగ్‌లెంగ్ షో’ అనే టాక్ షోకి శశి థరూర్ హాజరయ్యారు. ప్రదర్శన సందర్భంగా రాష్ట్ర యువతతో థరూర్ మాట్లాడారు. అయితే ఈ కార్యక్రమ హోస్ట్ అయిన ఆర్.లుంగ్‌లెంగ్ స్వయంగా ఒక వీడియోను తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ప్రదర్శనకు హాజరైన వ్యక్తి తనతో పాటు ఒక డిక్షనరీని తీసుకువెళ్లాడు. అది బహుశా కాంగ్రెస్ నాయకుడి పదజాలాన్ని అర్థంచేసుకోవడానికే అయ్యుంటుందని అందరూ అంటున్నారు. ఈ ఈ వీడియో షేర్ చూస్తూ “డాక్టర్ శశిథరూర్ ప్రసంగం వినడానికి నాగాలాండ్ (Nagaland) లోని ఎవరో ఆక్స్ఫర్డ్ డిక్షనరీని నా షోకి తీసుకొచ్చారు. థరూర్ మీటింగుకి డిక్షనరీలు తేవడమనేది జోక్ అనే అనుకున్నాను. కానీ ఇది చూశాక అది నిజమని అనిపిస్తోంది” అని ట్వీట్ చేశారు.