Labour Died: ఓ కండక్టర్ రాక్షుసుడిలా మారాడు.. అవును టాయిలెట్ వస్తుందని బస్సు ఆపమని కోరితే పిచ్చోడిలా ప్రవర్తించాడు. ప్రయాణికుడితో గొడవకు దిగాడు. వాగ్వివాదం తీవ్రస్థాయికి చేరింది. కోపోద్రిక్తుడైన కండక్టర్ ఆ ప్రయాణికుడిని కదిలే బస్సు నుంచి కిందకి తోసేశాడు. ఉత్తరప్రదేశ్ బరేలిలో ఈ ఘటన జరిగింది.
ఏం జరిగిందంటే..?
జైపూర్‌లో కూలి చేసే పిలిభిత్.. జెహానాబాద్ పీఎస్ పరిధిలో గల రామ్ నగర్‌కు చెందిన విజయపాల్‌ను (vijaypaul) దీపావళికి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులో జైపూర్‌కు విజయ్ పాల్ బయల్దేరాడు. రాత్రి టాయిలెట్ రావడంతో బస్సు ఆపాలని విజయ్ పాల్ (vijaypaul) కోరాడు. అందుకు కండక్టర్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. బస్సు ఆపమని అనడంతోపై ఇద్దరి మధ్య వాగ్వివాదం కొనసాగింది. బస్సు సంజయ్ నగర్ టర్న్ చేరుకోగానే విజయ్ పాల్‌ను కండక్టర్ బస్సు నుంచి కిందకి తోసేశాడు. బస్సు వెనక చక్రాల కిందపడ్డాడు. బస్సు ఆపి చూడగా.. నిర్జీవంగా పడి ఉన్నాడు. దీంతో బస్సులోని తోటి ప్రయాణికులు మండిపడ్డారు. బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను విషయం చెప్పి కూల్ చేశారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, కండక్టర్ పారిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని విజయ్ పాల్ కుటుంబ సభ్యలు డిమాండ్ చేస్తున్నారు.