కాంగ్రెస్ పార్టీ (Congress party) చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Chaudhary)సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిపై కోర్టులు ఎంత వేగంగా స్పందిస్తాయో చూస్తానని రేణుకాచౌదరి అన్నారు. 2018లో పార్లమెంట్లో ‘శూర్పణఖ’ అంటూ తనపై చేసిన ఆరోపణపై ప్రధాని మోదీపై పరువు నష్టం కేసు వేస్తానని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Chaudhary)సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిపై కోర్టులు ఎంత వేగంగా స్పందిస్తాయో చూస్తానని రేణుకాచౌదరి అన్నారు. 2018లో పార్లమెంట్లో ‘శూర్పణఖ’ అంటూ తనపై చేసిన ఆరోపణపై ప్రధాని మోదీపై పరువు నష్టం కేసు వేస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుచేస్తూ లోక్‌సభ (Lok Sabha) సచివాలయం నిర్ణయం తీసుకుంది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని (Lok Sabha) కోలార్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై (PM MODI) రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో (Court of Surat) పరువునష్టం దావా వేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. అయితే, ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడిన వారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ రాహుల్ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది.