ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్లో మాత్రం అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. మిజోరాంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నమోదైన పోలింగ్ శాతాన్ని ప్రకటించారు.
ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections ) మంగళవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో 2018లో 77.23 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి 20 నియోజకవర్గాల్లో కేవలం 71.11 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో (Mizoram Assembly Elections) చూస్తే 2018 ఎన్నికల్లో 80.03 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఈసారి కేవలం 77.39 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మిజోరాంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు.