»Supreme Court Order To Punjab Government On Punjab Farmers Burning Rice Stubble
Supreme court: రైతులు వరి పొట్టు కాల్చడంపై సుప్రీంకోర్టు రియాక్ట్
పంజాబ్(punjab)లో రైతులు పెద్ద ఎత్తున వరి కర్రలు కాల్చడంపై(rice stubble) సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని కారణంగా ఢిల్లీ పరిధిలో భారీగా వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తు చేసింది. ఇలాంటి క్రమంలో పంజాబ్ ప్రభుత్వం వరి పొట్టు కాల్చడాన్ని తక్షణమే నిషేధించాలని ఆ ప్రభుత్వాన్ని కోరింది.
Supreme court order to punjab government on punjab farmers burning rice stubble
ఢిల్లీ పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్య సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం సుప్రీంకోర్టు(Supreme court) పంజాబ్ ప్రభుత్వాన్ని(punjab government) వరి పొట్టు కాల్చడాన్ని (rice stubble)నిషేధించాలని కోరింది. అందుకోసం అక్కడి నేతలు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా పని చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వరి పొట్టు తగులబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. మీరు దీన్ని ఎలా ఆపుతారో మాకు తెలియదు. కానీ అది ఆగిపోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం దాన్ని ఆపడానికి మీ ప్రభుత్వం వైపు నుంచి తీవ్రమైన ప్రయత్నం జరగడం లేదని గుర్తు చేసింది. విచారణ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే, పొట్ట దగ్ధం సంఘటనలు 40% తగ్గాయని తెలిపింది. దీనిపై జస్టిస్ కౌల్ వ్యాఖ్యానిస్తూ ‘పంజాబ్‌లో ఇప్పటికీ అనేక చోట్ల వరి పొట్టును తగులబెడుతున్నారు. గత వారం తాను పంజాబ్ వెళ్లాను. రోడ్డుకు ఇరువైపులా పలురకాల మొక్కలు కాలిపోవడంతో పొగలు అలుముకున్నాయని అన్నారు.
ఇలాంటి నేపథ్యంలో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా, స్మోగ్ టవర్లు పని చేసేలా చూడాలని ఢిల్లీ(delhi) ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని డీపీసీసీ చైర్మన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్య సమస్యను ఎదుర్కోవడానికి వాహనాలకు సరి-బేసి వంటి పథకాలు కేవలం విండో డ్రెస్సింగ్ మాత్రమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. డీజీపీ, చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణలో ఈ వరిపొట్టు దహనంపై కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి స్థానిక ఎస్హెచ్ఓకు బాధ్యత వహించాలని కోరింది.
పంజాబ్‌లో రైతులు పొట్టను తగులబెట్టే సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం అలాంటివి 2,060 సంఘటనలు నమోదయ్యాయి. లూథియానాకు చెందిన పంజాబ్(punjab) రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం సోమవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 19,463కి పెరిగింది. ఈ డేటా ప్రకారం నవంబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు నమోదైన స్టబుల్ బర్నింగ్ సంఘటనలు ప్రస్తుత సీజన్లో మొత్తం కేసులలో 61 శాతం ఉన్నాయి. దీంతో ఢిల్లీ పరిధిలో కాలుష్య తీవ్రత మరింత పెరగడంతో అక్కడి స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించి మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.