»Arvind Kejriwal Kejriwal Is Eating Mangoes And Sweets For Bail Ed Says
Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ మామిడి, స్వీట్లు తింటున్నారన్న ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్య కారణాలు చూపించి ఈ కేసులో బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
Arvind Kejriwal: Kejriwal is eating mangoes and sweets for bail, ED says
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్య కారణాలు చూపించి ఈ కేసులో బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. డయాబెటీస్ ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే ఆయన రోజూ తీసుకుంటున్నారని ఈడీ తెలిపింది. ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఉంది. దీంతో అతను తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారు.
టైప్-2 డయాబెటీస్‌తో బాధపడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు అధికంగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు వంటి తింటున్నారు. ఇవి షుగర్‌లెవల్స్ పెంచుతాయనే విషయం తెలిసే ఆయన తింటున్నారని ఈడీ ఆరోపించింది. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. రోజుకు రెండుసార్లు కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నారని ఈడీ తెలిపింది.
ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆయన చక్కెరస్ధాయిలు రెట్టింపు అయినట్లు తెలిపింది. అయితే ఇంటిభోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని సీఎం తరపు న్యాయవాది అన్నారు. కేజ్రీవాల్ డైట్‌పై నివేదిక ఇవ్వాలని తిహార్ జైలు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. తర్వాత విచారణను రేపటికి వాయిదా వేసింది.