ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మరో సారి హత్యా బెదిరింపు మెసేజ్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ ‘112’కు ముఖ్యమంత్రిని హత్య చేస్తానంటూ మెసేజ్ పెట్టాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చిన మెసేజ్ లో ‘త్వరలోనే సీఎం యోగిని చంపేస్తా’ అని పేర్కొన్నట్లు పోలీసులు(Police) వెల్లడించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్ల(gangstar) భరతం పడుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ను అంతమొందిస్తామని తరచూ బెదిరింపు మెసేజు(Threat message)లు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఓ మీడియా సంస్థకు ఈమెయిల్(Email) వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా ఆయనకు మరో హత్యా బెదిరింపు మెసేజ్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఎమర్జెన్సీ నంబర్ ‘112’కు ముఖ్యమంత్రిని హత్య చేస్తానంటూ మెసేజ్ పెట్టాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చిన మెసేజ్ లో ‘త్వరలోనే సీఎం యోగిని చంపేస్తా’ అని పేర్కొన్నట్లు పోలీసులు(Police) వెల్లడించారు. వెంటనే పోలీసుల అప్రమత్తమైయ్యారు. ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై లక్నో(Luknow)లోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్(Sushant Golf City Police Station) లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు నిర్వహించిన పోలీసులు పంపిన వ్యక్తిని రెహాన్ గా గుర్తించారు.
కొద్ది రోజుల క్రితం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)కు హతం చేస్తానని మెయిల్ పంపించిన 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలుడు బీహార్(Bihar)కు చెందిన వ్యక్తి అని, అతడిని లక్నో(Luknow)లోని చిన్హాట్ ప్రాంతంలో అరెస్టు చేశారు. తర్వాత నోయిడా(Noida)కు తీసుకువచ్చారు. అనంతరం బాలుడిని నోయిడాలోని జువైనల్ కోర్టు(juvenile court)లో హాజరు పరిచారు. విచారణలో కోర్టు బెయిల్ తనకు మంజూరు చేసింది. ఏప్రిల్ 24న కొచ్చి(kochi)లో పర్యటించే ప్రధాని నరేంద్ర మోడీ()పై ఆత్మాహుతి బాంబు దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని జేవియర్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.