»Andhra Pradesh Pm Modi To Attend Tdp Jsp Meet At Chilakaluripet
pm modi : చిలకలూరిపేటలో మూడు పార్టీల ఉమ్మడి సభ.. హాజరుకానున్న మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
pm modi : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు ఖరారైన నేపథ్యంలో ఈ నెల 17న చిలకలూరి పేటలో (Chilakaluripet) భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. దీంతో టీడీపీ ఈ సభను జయప్రదం చేసేందుకు భారీగా సన్నాహాలు చేస్తోంది. ఆ పనులన్నీ చూసుకోవడానికి 13 కమిటీలను వేసింది.
ఈ సభ నిర్వహణ, కమిటీలతో సమన్వయ బాధ్యతలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తెలుగుదేశం హై కమాండ్ అప్పగించింది. మంగళవారం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), నారా లోకేష్‌లు కమిటీల సభ్యులందరితో భేటీ కానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి నేటి నుంచే పనులు ప్రారంభం కావాలని కార్యకర్తలు పనుల్లోకి రావాలని చంద్రబాబు కోరారు.
ఇదిలా ఉండగా చిలకలూరి పేట సభకు మోదీ( Modi) హాజరవుతారని ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం ఖరారు చేసింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కూడిన కమిటీలను నియమించారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రానుండడంతో మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మోదీ 16వ తారీఖున విశాఖకు చేరుకుంటారు. అక్కడ తమ పార్టీ ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు చిలకలూరి పేటలో మూడు పార్టీల బహిరంగ సభకు హాజరవుతారు.