»Golden Hour Golden Hour For Road Accident Victims Centres Scheme
Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్.. కేంద్రం పథకం
రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో మోడీ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత చికిత్స అందించనుంది. హర్యానా, చంఢీగఢ్‌లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రస్తుతం రెడీ అయ్యింది. తర్వాత దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. దీనికోసం ఎంవీఏ చట్టం-2019కి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకం కింద 1. 5 లక్షలు రూపాయలు లేదా 7 రోజుల చికిత్సలో ఏది తక్కువ ఖర్చయితే దాన్ని ఉచితంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు కల్పించాలనుకుంటుంది. అయితే, ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్‌గా పిలుస్తారు. ఈ టైమ్‌లోగా సరైన చికిత్స అందితే ప్రాణాలు దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కోసం సాధారణ బీమా కంపెనీలు 0.5 శాతం థర్డ్ పార్టీ ప్రీమియం వితరణతో సుమారు 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.