ఇటీవల సోషల్ మీడియాలో గీతాంజలి అనే యువతి వైరల్ అయ్యింది. జగన్ తనకు ఇళ్ల పట్టా ఇచ్చారని చెబుతూ సంతోషపడుతూ మీడియాతో పంచుకుంది. అయితే ఆమె ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది.
Andhra Pradesh: ఇటీవల సోషల్ మీడియాలో గీతాంజలి అనే యువతి వైరల్ అయ్యింది. జగన్ తనకు ఇళ్ల పట్టా ఇచ్చారని చెబుతూ సంతోషపడుతూ మీడియాతో పంచుకుంది. అయితే ఆమె ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. ట్రోలింగ్ కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఆమె వైసీపీ ప్రభుత్వం అందించిన సాయంపై మాట్లాడగా.. కొందరు సోషల్ మీడియా ఆమె ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో పోరాడి చనిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని #JusticeForGeethanjali #WeStandWithGeethanjali అనే యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలికి గీతాంజలి(28) తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పథకంలో ఆమెకు ఇల్లు వచ్చింది. ఇంటి పట్టాను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. వైసీపీ ప్రభుత్వం తన కల నెరవేరిందని, తన పిల్లలకు అమ్మ ఒడి వస్తుందని చెప్పింది. ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆనందంతో చెప్పింది. గీతాంజలి మాట్లాడిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. రాజకీయ కారణాలతో వైసీపీ శ్రేణులు ఈ వీడియోను పోస్టు చేయగా.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు ట్రోలింగ్ కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది.