Amit Shah visit cancelled : మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ శనివారం కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) పర్యటిస్తారని ప్రకటించారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. వాస్తవానికి ఆయన శనివారం భీమవరంలో పర్యటించాల్సి ఉంది. కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది.
వాస్తవానికి అమిత్ షాతో(Amit Shah) ఎన్నికల ప్రచారానికి భీమరంలో అన్ని ఏర్పాట్లూ జరిగాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తారని అంతా భావించారు. అయితే ఉన్నట్లుండి ఆయన పర్యటన రద్దు కావడంతో కూటమి శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో ఆంధ్రప్రదేశ్లో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ, తెలుగు దేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తమ అభ్యర్థుల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. హామీలను పదే పదే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.