BDK: రోగుల ఆరోగ్య పరిస్థితి, చికిత్సపై వైద్యులతో చర్చించి, వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు. హైదరాబాద్ నిమ్స్ చికిత్స పొందుతున్న నియోజకవర్గ రోగులను ఆయన పరామర్శించారు. సర్జరీ అవసరమైనవారికి ప్రభుత్వం ద్వారా LOC జారీ చేసి, సీఎం సహాయనిధి ద్వారా ఉచిత ఆపరేషన్లు చేపిస్తామని తెలిపారు.