GDWL: పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుందని ఎస్పీ టి. శ్రీనివాసరావు అన్నారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందిన సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కొత్తగా పదోన్నతి పొందిన ఏఆర్ ఎస్సైకి స్టార్ తొడిగి అభినందనలు తెలిపారు.