»Woman Applies Makeup While Skydiving From 10 Thousand Feet Height
Viral Video:10 వేల ఫీట్ల ఎత్తులో స్కై డైవింగ్ చేస్తూ ఆ పని..
అమెరికాకు చెందిన నటి మక్కెన్నా నైప్ 10 వేల ఫీట్ల ఎత్తులో స్కై డైవింగ్ చేస్తూ.. మేకప్ చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
Woman Applies Makeup While Skydiving From 10 thousand Feet Height
Viral Video:స్టంట్స్, అడ్వెంచర్స్ చేయడం అంటే కొందరికీ ఇష్టం. పేరు కోసమో.. లేదంటే నలుగురి గుర్తించాలనే తపనో కానీ.. సాహసాలు చేస్తుంటారు. అలాంటి కోవకు చెందుతారు అమెరికాకు చెందిన నటి మక్కెన్నా నైప్ (McKenna Knipe). ఆమె నటి.. అందరికీ తెలుసు.. కానీ ప్రపంచానికి తెలియాలి అనుకున్నారో ఏమో కానీ.. ఓ ఫీట్ చేశారు. ఆ ఫీట్ ఏంటో తెలుసుకుందాం. పదండి.
మక్కెన్నా నైప్ (McKenna Knipe).. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమెకు చాలామంది ఫాలొవర్లు ఉన్నారంటే ఆమె పాపులారిటీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు స్కై డైవింగ్ చేశారు.. ఇప్పుడు కొత్తగా ట్రై చేశారు. అలా చేయడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు.
గాలిలో 10 వేల ఫీట్ల ఎత్తులో (10 thousand Feet) ఉన్నారు. ఏ వణుకు లేదు. బెణుకు లేదు. మెల్లిగా మేకప్ కిట్ తీశారు. మేకప్ ఎలా వేసుకోవాలి చేసి చూపించారు. మేకప్ ఇంట్లో వేసుకోవాలో.. గాలిలో వేసుకోవాలో తెలియదు కానీ.. ఎలాంటి భయం లేకుండా చూపించారు. వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
వీడియోను చూసి పలువురు నెటిజ్లను (netizens) కామెంట్స్ చేస్తున్నారు. మీరు గ్రేట్.. స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశావ్ అంటూ తెగ కామెంట్స్ చేస్తు్ననారు. వావ్.. యువర్ గ్రేట్ (great) అని కొందరు రాశారు. గ్రేట్, చాలా ధైర్యం ఉంది అని కామెంట్ చేశారు.