పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు చేస్తుందా? నటిస్తుందా? అనే సందేహాలు ఉండేవి. కానీ లావణ్య మాత్రం యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. పెళ్లి తర్వాత లావణ్య నుంచి ఓ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటోంది.
Why do I have conditions? Lavanya Tripathi comments
Lavanya Tripathi: ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్‌లో లావణ్య త్రిపాటి నటించిన ‘మిస్ ఫర్ఫెక్ట్’ రిలీజ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా లావణ్య నటించింది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ లావణ్య రావు పాత్రలో కనిపించనుంది. ఇందులో పరిశుభ్రతను ఇష్టపడే లావణ్య జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.. పరిశుభ్రత అంబాసిడర్‌గా లావణ్య త్రిపాఠి నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌ను ప్రమోట్ చేసే పనిలో ఉంది ఈ మెగా కోడలు. ఇటీవలె వరుణ్ తేజ్‌తో కలిసి పెళ్లి పీఠలెక్కింది లావణ్య. దీంతో పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు చేస్తుందా? అనే సందేహాలు వచ్చాయి. కానీ లావణ్య మాత్రం సినిమాలు కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత లావణ్య నుంచి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ వస్తోంది. ఓటిటి వేదికగా ఫిబ్రవరి 2న డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు రానుంది.
ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా లావణ్య త్రిపాఠి మీడియా ముందుకు రావడంతో పలు రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె నటించడం గురించి ఎక్కువగా అడుగుతున్నారు. పెళ్లి తర్వాత బాధ్యతలు, కండిషన్లు ఉంటాయి? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని అడగ్గా, లావణ్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. నాకు ఎలాంటి కండిషన్స్ పెడతారు? అసలు ఎందుకు పెడతారు? అని ఎదురు ప్రశ్నించింది. నేను పెళ్ళికి ముందు కూడా నటించాను. కానీ ఎప్పుడూ శృతి మించే పాత్రలు చేయలేదు. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలు చేయను. అలా అని పెళ్లయింది, భయపడి చేయకపోవడం కాదు.. ఇప్పుడు చేస్తున్న తరహా పాత్రల్లోనే కంటిన్యూ చేస్తా.. అలాంటప్పుడు ఎందుకు కండిషన్స్ పెడతారు? అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. ఎలాంటి హద్దులు మీరకుండా లావణ్య సినిమాలు చేస్తునే ఉంటానని చెప్పేసింది.